Friday, November 22, 2024

TATA | ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు..

రానున్న 5 సంవత్సరాల్లో టాటా గ్రూప్‌ 5 లక్షల ఉద్యోగాలు సృష్టించనుందని గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ తెలిపారు. సెమీ కండక్టర్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీ సంబంధిత రంగాల్లో ఈ ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. ఇండియన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సింపోజియంలో మంగళవారం నాడు చంద్రశేఖరన్‌ ప్రసంగిస్తూ ఈ విషయం వెల్లడించారు.

టాటా గ్రూప్‌ రానున్న ఐదు సంవత్సరాల్లో సెమీ కండక్టర్‌, ప్రెసిషన్‌ మాన్యుఫాక్చరింగ్‌, అసెంబ్లింగ్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్‌, బ్యాటరీ తయారీ, తదితర రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని ఆయన చెప్పారు. ఈ పెట్టుబడులు రానున్న ఐదు సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు తెలిపారు.

అస్సాంలోని సెమీ కండక్టర్‌ ప్లాంట్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీలకు సంబంధించిన పలు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో మరికొన్ని చిన్న చిన్న ప్లాంట్లు కూడా వస్తాయన్నారు. తయారీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరగాలంటే ప్రభుత్వ సహకారం అవసరమని చంద్రశేఖరన్‌ చెప్పారు. సెమీకండక్టర్‌ వంటి తయారీ రంగాల్లో వచ్చే ప్రతి ఉద్యోగానికి పరోక్షంగా 8010 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement