ముంబై : ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ రిటైల్ ఫుడ్ బిజినెస్‌ను రుచి సోయా టేకోవర్ చేసుకోనుంది. దీనికి సంబంధించిన బిజినెస్ ట్రాన్స్‌ఫర్ అగ్రిమెంట్ ఈ రెండు కంపెనీల మధ్య కుదిరాయి. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ను రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ టేకోవర్ చేస్తుందని మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరు కూడా మార్చుకోనుంది. ఇకపై ఇది పతంజలి ఫుడ్స్‌్ లిమిటెడ్‌గా ఆవిర్భవించనుంది. ఈ బదలాయింపులకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలతో కూడిన ప్రతిపాదనలను పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీ బుధవారం రెగ్యులేటరీకి సమర్పించింది. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్‌కు చెందిన రుచి సోయాను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వివరించింది. పతంజలి అనేది బ్రాండ్ నెెమ్ కింద ఇకపై రుచి సోయా గానీ, పతంజలి ఆయుర్వేద ఫుడ్స్ గానీ అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది.
ప్లాంట్లన్నీ.. పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌కు..
పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ను రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొత్తం రూ.690 కోట్లకు కొనుగోలు చేసినట్టు మేనేజ్‌మెంట్ తన ప్రతిపాదనల్లో పొందుపర్చింది. నెయ్యి, తేనె, ఇతర మసాలా దినుసులు, గోధుమలు, పండ్ల రసాలు, నూడుల్స్, రవ్వా ఇడ్లీ, జింజర్ పికిల్స్, వంటి మొత్తం 21 రకాల ఫుడ్ ప్రొడక్టులు అన్నీ కూడా ఇకపై పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ అనే పేరు మీద ఉంటాయని వివరించింది. రుచి సోయాను కూడా ఈ బ్రాండ్ పరిధిలోకే చేర్చినట్టు తెలిపింది. పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్ పరిధిలోని మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్, లేబ్లింగ్, ఇతర రిటైల్ ట్రైడింగ్ ప్రొడక్ట్ ్స.. అన్నీ రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు బదలాయింపు అయ్యాయి. అలాగే బిహార్‌లోని పదర్థ, ఉత్తరాంచల్, హరిద్వార్, మహారాష్ట్రలోని నెవాసలోని మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు ఇకపై కొత్తగా ఆవిర్భవించిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ పరిధిలోకి వస్తాయని ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీల యాజమాన్యం రెగ్యులేటరీకి తెలియజేసింది
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..