తమిళనాడులోని తూత్తుకుడి కేంద్రంగా పని చేస్తున్న తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఐపీఓ సెప్టెంబర్ 5న ప్రారంభమై 7న ముగస్తుంది. ఓక్కో షేరు ధరను 500-525 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా 1.58 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా గరిష్టంగా 882 కోట్లు సేకరించనున్నారు. ఈ నిధులు భవిష్యత్ మూలధన అవసరాలకు ఉపయోగించుకుంటామని బ్యాంక్ తెలిపింది.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ దేశంలో అత్యంత పురాతనమైన ప్రయివేట్ బ్యాంక్. దీనికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతతి పరిశ్రమలతో పాటు, వ్యవసాయం, రిటైల్ వినియోగదారులకు ఈ బ్యాంక్ వివిధ రకాల బ్యాంకింగ్, ఆర్థిక సేవలను అందిస్తోంది. పబ్లిక్ ఆఫర్‌లో 75 శాతం షేర్లను అర్హత ఉన్న సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించారు. 15 శాతం ఇతరులకు, 10 శాతం షేర్లు రిటైల్ మదుపరులకు కేటాయించారు.