Saturday, November 23, 2024

ఐపీవోకి స్విగ్గీ..

వినియోగదారులుకు కావాల్సిన ఆహార పదార్థాలను వారి ఇంటివద్దనే అందజేస్తున్న స్విగ్గీ 80 -100కోట్ల డాలర్లు పబ్లిక్‌ ఇష్యూకు రానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఐపీఓ కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, జేపీ మోర్గాన్‌లను నియమించినట్లు సమాచారం. మర్చంట్‌ బ్యాంకర్లను కూడా వినియోగించనుంది. ఈ ఐపీఓ ద్వారా 10శాతం కంపెనీ వాటాలను విక్రయించనున్నారు.

కాగా సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ పెట్టుబడులున్న స్విగ్గీ విలువ జనవరి నాటికి రెండింతలు పెరిగి 10.7బిలియన్‌ డాలర్లుకు చేరుకుంది. కాగా 2014లో ప్రారంభమైన స్విగ్గీ 500కు పైగా నగరాల్లో 1,85000 రెస్టారెంట్లు, విక్రయశాలల నుంచి వినియోగదార్లుకు సేవలందింస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement