టిట్టర్‌ను ఎలాన్ మస్క్ చేజిక్కించుకోవడాన్ని తాను సమర్థిస్తున్నట్టు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే తెలిపాడు. పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు వెల్లడించాడు. సమస్యకు ఏకైక పరిష్కారం చూపగల సత్తా మస్క్‌కే ఉందని వివరించాడు. టిట్టర్ అంటే నాకెంతో ప్రేమ. ఒక కంపెనీగా నాకున్న ఏకైక సమస్య కూడా.. ప్రస్తుతం వాది వాల్‌స్ట్రీట్ యాజమాన్యం చేతుల్లో ఉంది. దాన్నుంచి బయటకు తీసుకురావడం కంపెనీ భవిష్యత్తుకు సరైన ముందడుగు అని జాక్ అభిప్రాయపడ్డాడు. ప్రైవేటు కంపెనీగా ఉంచుతానని మస్క్ ప్రకటించిన నేపథ్యంలో.. టిట్టర్ పబ్లిక్ ఇష్యూ లిస్టింగ్‌లోకి రాదు.
ఇది ఓ కంపెనీలా కాకుండా.. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటానని జాక్ వెల్లడించాడు. టిట్టర్‌లో మస్క్ తీసుకొచ్చే సంస్కరణలకు మద్దతు ఇస్తున్నాను. ఒక అసాధ్య పరిస్థితి నుంచి కంపెనీని బయటపడేసిన మస్క్.. పరాగ్‌కు కృతజ్ఞతలు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..