హెచ్1బీ వీసాల కోసం 2023 వరకు తగినన్ని అప్లికేషన్లు వచ్చాయని ఇమిగ్రేషన్ అధికారులు ప్రకటించారు. 2023 సంవత్సరానికి 65 వేల హెచ్1బీ వీసాలను జారీ చేస్తారు. అమెరికన్ కంపెనీలు విదేశాల నుంచి కావాల్సిన ఉద్యోగులను ఈ హెచ్1బీ వీసా ద్వారా అమెరికాకు తీసుకుంటారు. ఇది నాన్ ఇమిగ్రేషన్ వీసా. ఈ వీసాలతో ప్రధానంగా మన దేశానికి, చైనాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను కంపెనీలు అమెరికా పంపిస్తుంటాయి. అందుకే టెక్నాలజీ కంపెనీలకు హెచ్1బీ వీసాలు కీలకమైనవి. అమెరికా కాంగ్రెస్ నిర్ణయం ప్రకారం తప్పనిసరిగా 65 వేల హెచ్1బీ వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది.
ఈ రిజిస్ట్రేషన్ ఆధారంగానే హెచ్1బీ క్యాప్ పిటిషన్స్‌ను అనుమతిస్తున్నారు. ఫెడరల్ ఏజెన్సీ ఇంకా అప్లికేషన్లను తీసుకుంటోంది. గతంలో అప్లయ్ చేసి, క్యాప్ నెంబర్ ఉన్న వారిని 2023 కోటాలో మిన్హయించారు. అమెరికాలోనే ఉండి ఉద్యోగం మారిన వారిని, ప్రస్తుత కోటాలో అనుమతి ఇస్తారు.