హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : అనంత్ నేషనల్ యూనివర్శిటీ 6వ స్నాతకోత్సవాన్ని నిర్వహించింది. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ డిజైన్ అండ్ అనంత్ ఫెలోషిప్ ఇన్ సస్టైనబిలిటీ అండ్ బిల్ట్ ఎన్విరాన్మెంట్ నుండి 293మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసింది.
పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత, పార్లమెంటు (రాజ్యసభ) సభ్యులు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్, రచయిత్రి అండ్ పరోపకారి సుధామూర్తి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంత్ నేషనల్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ అజయ్ పిరమల్, అనంత్ నేషనల్ యూనివర్శిటీ ప్రొవోస్ట్ డాక్టర్ అనునయ చౌబే, అనంత్ నేషనల్ యూనివర్శిటీ వ్యవస్థాపక ప్రొవోస్ట్ డాక్టర్ ప్రమత్ రాజ్ సిన్హా అండ్ బోర్డు సభ్యులు స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. పిరమల్ గ్రూప్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ స్వాతి పిరమల్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈసందర్భంగా సుధా మూర్తి మాట్లాడుతూ.. మీరందరూ బ్రహ్మ దేవుడు వంటి సృజనాత్మక వ్యక్తులు-సృష్టికర్తలని అన్నారు. డిజైన్ ద్వారా మీరు మీ భావోద్వేగాలు, ఆలోచనలను వ్యక్తపరుస్తారన్నారు. మీ ప్రాజెక్ట్‌ల ద్వారా మీరు కమ్యూనిటీలతో ఎలా కనెక్ట్ అవుతారనేది నిజంగా ప్రత్యేకమన్నారు. తన అనుభవంలో చాలా మంది యువకులు అర్ధవంతమైన కనెక్షన్లను నిర్మించుకోవడానికి కష్టపడుతున్నారని, కానీ అనంత్ విషయంలో అలా కాదన్నారు. ఈ ప్రత్యేకమైన నాణ్యత మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుందన్నారు.
అనంత్ నేషనల్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ అజయ్ పిరమల్ మాట్లాడుతూ… ఆధునిక సాంకేతికతను సాంప్రదాయ పద్ధతులతో మిళితం చేసే ప్రపంచ స్థాయి విద్యను అందిస్తూ డిజైన్ విప్లవానికి నాయకత్వం వహిస్తున్నామన్నారు.
అనంత్ నేషనల్ యూనివర్శిటీ ప్రోవోస్ట్ డాక్టర్ అనునయ చౌబే మాట్లాడుతూ… సాంప్రదాయ తరగతి గదులకు మాత్రమే పరిమితం కాకుండా నిజ-సమయంలో కమ్యూనిటీలతో పనిచేసే నిజ జీవిత అనుభవాల ద్వారా తమ విద్యార్థులు ప్రపంచంపై క్లిష్టమైన అవగాహనతో సృజనాత్మకతను పెంపొందించుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు.