Saturday, November 23, 2024

రెయిన్‌బో ఐపీఓ సెబీకి పత్రాల సమర్పణ.. 27న బిడ్డింగ్‌ ప్రారంభం

భారతదేశంలో సుప్రసిద్ధ మల్టిd స్పెషాలిటీ పీడియాట్రిక్‌, అబ్‌స్టెట్రిక్‌, గైనకాలజీ హాస్పిటల్‌ చైన్‌లో ఒకటైన రెయిన్‌బో చిల్డ్రన్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ తన తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ను తీసుకొస్తున్నది. ఈ సందర్భంగా ఐపీఓకు సంబంధించిన విషయాలను ఆస్పత్రి చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ఆర్‌ఆర్‌ గౌరీశంకర్‌, చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌ కంచర్ల, ఆస్పత్రికి సంబంధించిన స్ట్రాటజీ హెడ్‌ మహేశ్‌ మద్దూరీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రెయిన్‌ బో చిల్డ్రన్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ ఐపీఓ 2022, ఏప్రిల్‌ 27వ తేదీన ప్రారంభం అవుతుందని తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లిd, విజయవాడతో పాటు విశాఖపట్నంలో తాము సేవలు అందిస్తున్నట్టు వివరించారు. మొత్తం 14 ఆస్పత్రులు.. మూడు క్లీనిక్స్‌ ద్వారా రాణిస్తున్నట్టు తెలిపారు. 2021, డిసెంబర్‌ 31 నాటికి అన్ని బ్రాంచుల్లో కలిపి 1500కు పైగా పడకలు ఉన్నాయని వివరించారు.

కనీస షేర్లు 27
తమ సంస్థ రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌ ప్రైస్‌బ్యాండ్‌ను రూ.516 నుంచి రూ.542 మధ్య స్థిరీకరించినట్టు తెలిపారు. కనీసం 27 ఈక్విటీ షేర్లతో తమ బిడ్‌ను దాఖలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఐపీఓ బిడ్డింగ్‌ 2022, ఏప్రిల్‌ 29తో ముగుస్తుందని చెప్పుకొచ్చారు. మే 5వ తేదీన అలాట్‌మెంట్‌ ప్రక్రియను ప్రారంభిస్తామని, రీఫండ్‌/అన్‌బ్లాకింగ్‌ ఏస్‌బీఏ ఫండ్‌ మే 6కల్లా పూర్తవుతుందని తెలిపారు. తమ తమ డీమ్యాట్‌ అకౌంట్స్‌లో షేర్లు మే 9వ తేదీన క్రెడిట్‌ అవుతాయని, 10వ తేదీన ట్రేడింగ్‌కు వస్తాయని చెప్పుకొచ్చారు. సంస్థలో పని చేసే ఎంప్లాయీస్‌కు ఒక్కో షేర్‌పై రూ.20 డిస్కౌంట్‌ను కూడా ఇచ్చేందుకు నిర్ణయించినట్టు వివరించారు.

ఉద్యోగులకు 3లక్షల షేర్లు
ఈ ఐపీలో భాగంగా రూ.10 ముఖ విలువ కలిగిన 2,40,00,900 ఈక్విటీ షేర్లను ప్రమోటర్‌ సెల్లింగ్‌ షేర్‌ హోల్డర్లు విక్రయించనుండగా.. 2800 మిలియన్‌ రూపాయలు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనున్నట్టు తెలిపారు. ఈ ఆఫర్‌లో భాగంగా 3,00,000 ఈక్విటీ షేర్లను ఉద్యోగులకు కూడా కేటాయిస్తున్నామన్నారు. ఈ ఆఫర్‌ ద్వారా సమీకరించిన మొత్తాలను ఎన్‌సీడీల ముందస్తు రిడంప్షన్‌తో పాటు నూతన హాస్పిటల్స్‌ నిర్మాణానికి ఉపయోగిస్తామన్నారు. నూతన వైద్య పరికరాల కొనుగోలు చేస్తామని, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగిస్తామని ప్రకటించారు. కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ లిమిటెడ్‌, జేపీ మోర్గాన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌లు ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. 2021, డిసెంబర్‌ 31 నాటికి 641 ఫుల్‌ టైం డాక్టర్లు, 1,947 పార్ట్‌టౖౖెం/విజిటింగ్‌ డాక్టర్లు సేవలు అందిస్తున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శిరీష్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement