Wednesday, November 20, 2024

Stock markets: 16 వేల మార్కును దాటిన నిఫ్టీ..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను ముటగట్టుకున్నాయి. జులై నెలలో జీఎస్టీ వసూళ్లు 33 శాతం పెరిగి రూ. 1.16 లక్షల కోట్లకు చేరుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.ఇక నిఫ్టీ తొలిసారి 16 వేల మార్కును అధిగమించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 873 పాయింట్లు లాభపడి 53,823కి పెరిగింది. నిఫ్టీ 246 పాయింట్లు పుంజుకుని 16,131 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా
టైటాన్ కంపెనీ (4.16%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (3.72%), నెస్లే ఇండియా (3.44%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.36%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.47%) ఉన్నాయి. కాగా టాప్ లూజర్స్ గా ఎన్టీపీసీ (-0.30%), బజాజ్ ఆటో (-0.23%), టాటా స్టీల్ (-0.15%) ఉన్నాయి.

ఇది కూడా చదవండి: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement