Friday, November 22, 2024

Follow up : భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు.. అన్ని రంగాల్లో కొనుగోళ్లపై ఆసక్తి

అక్టోబర్‌ చివరి వారం ట్రేడింగ్‌లో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్ల అండతో స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాలన్ని నమోదు చేశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. అన్ని రంగాల్లో కొనుగోళ్లపై ఆసక్తి కనిపించింది. ముఖ్యంగా ఐటీ, ఆటో రంగాల సూచీలు మార్కెట్ల ర్యాలీకి మద్దతు ఇచ్చాయి. అమెరికా వృద్ధిరేటు, ఇతర కీలక రంగా గణాంకాలు మెరుగుపడినందున అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల విషయంలో దూకుడుగా ఉండకపోవచ్చని అంచనాలు ఉన్నాయి.

బుధవారం రాత్రి ఫెడ్‌ రేట్లను ప్రకటించనుంది. రెండు సెషన్లుగా విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఇది కూడా మార్కెట్లలో పాజిటివ్‌ సంకేతాలు ఇచ్చింది. సెన్సెక్స్‌ 786.74 పాయింట్లు లాభపడి 60746.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 225.40 పాయింట్లు లాభపడి 18012.20 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 165 రూపాయిలు పెరిగి 50395 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 170 రూపాయలు పెరిగి 57650 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకపు విలువ 82.32 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు

- Advertisement -

ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్‌ ఎం, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియా పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, విప్రో, ఐటీసీ, ఎస్‌బీఐ, మారుతి సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement