Saturday, November 23, 2024

Follow up : లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నాడు లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి తీవ్ర ఒడుదుడుకుల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి అరగంటలో కోలుకుని భారీ లాభాల్లో ముగిశాయి. చిరలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో సూచీలు కోలుకున్నాయి. అక్టోబర్‌లో రిటైల్‌, హోల్‌ సేల్‌ ద్రవ్యోల్బణం భారీగా తగ్గడంతో మార్కెట్లలో తోడ్పడింది. సెన్సెక్స్‌ 248.84 పాయింట్లు లాభపడి 61872.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 74.25 పాయింట్ల లాభంతో 18403.40 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 123 రూపాయలు పెరిగి 52841 వద్ద ట్రేడయ్యింది. వెండి కేజీ ధర 30 రూపాయలు పెరిగి 62500 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 80.49 వద్ద ముగిసింది.

లాభపడిన షేర్లు

పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌ అండ్‌ టీ, టాటా స్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement