దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నాడు లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా లోహ, స్థిరాస్తి, విద్యుత్ రంగాల్లో కొనుగోళ్ల మద్ధతుతో మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లో మధ్యాహ్నం తరువాత అమ్మకాల ఒత్తిడితో ఓ దశలో స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి కొనుగోళ్ల మద్దతుతో చివరి అరగంటలో పుంజుకొని లాభాల్లో ముగిసింది. ఆసియా సూచీలు లాభాల్లో ముగియడం మన మార్కెట్లకు కలిసి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాలతో చాలా దేశాల కేంద్ర బ్యాంక్‌లు వడ్డీరేట్లను పెంచే విషయంలో అచితూచీ వ్యవహరిస్తున్నాయన్న వార్తలు కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది. సెన్సెక్స్ 212.88 పాయింట్ల లాభంతో 59756.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 80.60 పాయింట్ల లాభంతో 17736.95 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 6 రూపాయలు తగ్గి 50681 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 323 రూపాయల పెరిగి 58489 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకపు విలువ 82.66 రూపాయలుగా ఉంది.
లాభపడిన షేర్లు
టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సీ, ఎంఅండ్ ఎం, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, బీపీసీఎల్, ఓఎన్జీసీ, టాటా మోటర్స్, హీరో మోటో కార్ప్ షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు
బజాజ్ ఫైనాన్స్, ఏషియా పెయింట్స్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు నష్టపోయాయి.