Friday, November 22, 2024

ప్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. డాలర్​తో రూపాయి మారకం విలువ రూ. 79.23

దేశీయంగా ఎలాంటి బలమైన సంకేతాలు లేకపోవడం, అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నందున్న మార్కెట్లు అప్రమత్తంగా వ్యవహరించాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఉదయం నుంచే ప్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభమయ్యాయి. రోజంతా కూడా మార్కెట్లు ఇలానే కొనసాగాయి. సెన్సెక్స్‌ 35.78 పాయింట్లు నష్టపోయి 58817.29 వద్ద ముగిసింది. నిఫ్టీ 9.65 పాయొంట్లు లాభపడి 17534.75 వద్ద ముగిసింది. బంగారం ధర 144 రూపాయలు తగ్గి 52345 వద్ద ముగిసింది. వెండి కిలో 232 రూపాయలు తగ్గి 58559 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకపు విలువ 79.23 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు :  టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, టాటా మోటర్స్‌, అపోలో ఆసుప్పటల్స్‌, కోల్‌ ఇండియా, హిండాల్కో షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు : బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, అదానీ పోర్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement