Thursday, September 19, 2024

Stock markets: నిఫ్టీ సరికొత్త రికార్డు.. 25వేల మార్క్ కు చేరిక…

దేశీయ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ సూచీ ఆరంభంలో 208.34 పాయింట్లు (0.25 శాతం) లాభపడి 81,949.68కు పెరిగింది. 82,082 రికార్డు స్థాయి మైలురాయిని కూడా తాకింది. ఇక ఆరంభంలో 92.15 పాయింట్లు లాభపడ్డ ఎన్‌ఎస్ఈ నిఫ్టీ సూచీ రికార్డు సృష్టించింది.

చరిత్రలో తొలిసారి 25,000 మైలురాయిని తాకింది. 0.37 శాతం లాభపడి 25,030.95 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ-50 సూచీలో మారుతీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, కోల్ ఇండియా, టాటా మోటార్స్ అత్యధికంగా లాభాపడిన స్టాకుల జాబితాలో ఉన్నాయి. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా అత్యధికంగా నష్టపోయిన స్టాకులుగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.

6 నెలల్లో 15 శాతం పెరిగిన నిఫ్టీ…
గత ఆరు నెలల్లో నిఫ్టీ సూచీ 15 శాతానికి పైగా వృద్ధి చెందింది. ఇదే సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 14 శాతానికి పైగా ర్యాలీ అయింది. జులై 23న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు మాత్రం పరుగులు పెడుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement