Monday, January 13, 2025

Stock Market : భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. వరుసగా నాలుగో రోజు క్షీణత నమోదు చేశాయి. అన్ని సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా క్షీణించి 76,535 కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ పాయింట్లకుపైగా తగ్గి 23,172 పాయింట్లకు తగ్గింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సూచీలపై ప్రతికూల ప్రభావం పడింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 5 నిమిషాల్లోనే రూ. 5 లక్షల కోట్లు తగ్గి రూ. 430 లక్షల కోట్ల నుంచి రూ. 425 లక్షలకు పడిపోయింది. గత నాలుగు సెషన్లలో చూస్తే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 17 లక్షల కోట్లు తగ్గింది. ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ కావడానికి ఐదు ముఖ్యమై కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గత మూడు నెలల్లోనే గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది. అమెరికా ఆంక్షలు రష్యా చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్, చైనా దేశాలకు రష్యా అధిక చమురును సరఫరా చేస్తోంది. రష్యా లక్ష్యంగా జో బైడెన్ చుమురు, గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించారు.

ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి రూపాయి విలువ..
అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రూ. 86.27 కు పడిపోయింది. ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ బలపడటం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది.

- Advertisement -

ట్రంప్ వాణిజ్య విధానాలపై అనిశ్చితి..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్, చైనా సహా ఇతర దేశాలు లక్ష్యంగా ఆయన టారిఫ్లు విధించే అవకాశం ఉందని ఆందోళనలు ఉన్నాయి. అయితే ఇది కచ్చితంగా జరుగుతుందని చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ టారిఫ్లు పెంచితే మాత్రం ఆసియ ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఎఫ్ పీఐల విక్రయాలు..
ఫారెన్ పోర్టో ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) 2025 లో జనవరి 10 వరకే రూ. 21,350 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డిసెంబర్ లో రూ. 16,982 కోట్లతో పోల్చితే అధికంగా విక్రయాలు జరిపారు. అక్టోబర్ నుంచి వారు వరుసగా విక్రయాలు జరుపుతూనే ఉన్నారు. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలపడట, యూఎస్ ఫెడరల్ రిజ్వర్ ఆశించినంతగా వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చనే అంచనాలు, భారత మార్కెట్లు అధిక స్థాయిల వద్ద ఉండటంతో ఫారెన్ పోర్ట్ ఫోలియే ఇన్వెస్టర్లు విక్రయాలు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement