దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నాడు లాభాల్లో ముగిశాయి. ఉదయం ఊగిసలాట మధ్య ప్రారంభమైన సూచీలు చివరి అరగంట వరకు నష్టాల్లో ట్రేడయ్యాయి. కనిష్టాల వద్ద ఆఖరులో లభించిన కొనుగోళ్ల అండతో లాభాల్లోకి ఎగబాకాయి. దీంతో రెండు రోజుల వరస నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపించాయి. అమెరికా ఫెడ్ రేట్లను పెంచడం, మరికొన్ని సార్లు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందన్న
వార్తలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. విదేశీ మదుపర్లు ఈక్విటీ మార్కెట్లలో జరుపుతున్న కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నిలుస్తున్నాయి. సెన్సెక్స్ 113.95 పాయింట్ల లాభంతో 60950.36 వద్ద ముగిసింది. నిఫ్టీ 64.45 పాయింట్ల లాభంతో 18117.15 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 534 రూపాయలు పెరిగి 50718 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 1580 రూపాయలు పెరిగి 59906 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.74 రూపాయిలుగా ఉంది.
లాభపడిన షేర్లు
బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, ఎల్ అండ్ టీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎంఅండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, మారుతి సుజుకీ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.