దేశీయ స్టాక్‌మార్కెట్లు వరసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో సానుకూలతలు, విదేశీ మదుపర్లు కొనుగోళ్లు మార్కెట్ల సెంటిమెంట్‌ను పెంచాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు, రోజంతా లాభాల్లోనే కొనసాగింది. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంపు నిర్ణయం నేపథ్యంలోనూ సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు బలంగా ముగియడం కూడా మార్కెట్లుకు కలివివచ్చింది. సెన్సెక్స్ 374.76 పాయింట్ల లాభంతో 61121.35 వద్ద ముగిసింది. నిఫ్టీ 133.20 పాయింట్ల లాభంతో 18145.40 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 143 రూపాయలు పెరిగి 50465 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 977 రూపాయిలు పెరిగి 58655 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.25 రూపాయిలుగా ఉంది.
లాభపడిన షేర్లు
ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్ ఎం, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఓన్‌జీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు
యాక్సిస్ బ్యాంక్; రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకీ, టాటా స్టీల్, హీరో మోటోకార్పొరేషన్ షేర్లు నష్టపోయాయి.