స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు లాభాల్లో ముగిశాయి. క్రితం వారం వరసగా నాలుగు రోజులు మార్కెట్లు నష్టాలు ఎదుర్కొన్నాయి. వినియోగ ఉత్పత్తుల కంపెనీలు, బ్యాంకింగ్, ఫైనాన్షీయల్ స్టాక్స్ మద్దతుతో మార్కెట్లు గ్రీన్ జోన్‌లోకి వెళ్లాయి.
సెన్సెక్స్ 326.84 పాయింట్ల లాభంతో 53234.77 వద్ద ముగిసింది. నిఫ్టీ 83.30 పాయింట్ల లాభంతో 15835.35 వద్ద ముగిసింది.
బంగారం పది గ్రాముల ధర 182 రూపాయలు పెరిగి 52099 వద్ద ట్రేడ్ అయ్యింది. వెండి కేజీ 58 రూపాయిలు పెరిగి 57800 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 78.81 గా ఉంది. హిందూస్థాన్ యూనిలీవర్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ , ఎస్బీఐ , పవర్ గ్రిడ్, బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టీసీఎస్, టాటా స్టీల్, మహీంద్రా, మహీంద్రా, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ , విప్రో , జేఎస్‌డబ్ల్యూ, ఓఎన్జీసీ, సిప్లా వంటి షేర్లు నష్టపోయాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.