Thursday, November 21, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

స్టాక్‌మార్కెట్లు మంగళవారం నాడు నష్టాల్లో ముగిశాయి. ప్రారంభంలో లాభాల్లో ట్రేడయిన మార్కెట్లు కొద్ద సమయానికే నష్టాల్లోకి వెళ్లాయి. ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. కొనుగోళ్ల మద్ధతుతో కోలుకున్న మార్కెట్లు చివరి వరకు లాభాల్లో కొనసాగాయి. చివరిలో అమ్మకాలు పెరగడంతో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు, చమురు ధరలు పెరగడం వంటివి మార్కెట్‌ సెంట్‌మెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్‌ 48.99 పాయింట్లు నష్టపోయి 59196.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 10.20 పాయింట్లు నష్టపోయి 17655.60 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 13 రూపాయలు తగ్గి 50420 వద్ద ట్రేడయ్యింది. సిల్వర్‌ కేజీ 338 రూపాయలు పెరిగి 53728 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.58 రూపాయలుగా ఉంది.

భపడిన షేర్లు

భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, డా.రెడ్డీస్‌ ల్యాబ్‌, సన్‌ ఫార్మా, అపోలో హాస్పటల్స్‌, శ్రీ సిమెంట్స్‌, సిప్లా,ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా కన్జ్యూమర్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, యూపీఎల్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంకక్‌, నెస్లే ఇండియా, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టపోయాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement