Friday, November 22, 2024

నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వరుసగా మూడు సెషన్లలో లాభాలు పొందిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలలో ముగిశాయి. కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతుండడం మదుపరుల సెంటిమెంటును దెబ్బకొట్టింది. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో మార్కెట్లు ఈ వారాంతాన్ని నష్టాలలో ముగించాయి. పర్యవసానంగా సెన్సెక్స్ 154.89 పాయింట్ల నష్టంతో 49591.32 వద్ద… నిఫ్టీ 38.95 పాయింట్ల నష్టంతో 14834.85 వద్ద క్లోజయ్యాయి. 14,882 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 14,834 వద్ద రోజును ముగించింది. సిప్లా, సన్ ఫార్మా, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా లాభాలను ఆర్జించగా.. బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, ఎన్‌టీపీసీ, అల్ట్రా టెక్ సిమెంట్ నష్టాలను చవిచూశాయి. కరోనా కేసులు పెరుగుతుండడం, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ బాట పట్టడం మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement