కీలక రంగాల షేర్లు రాణిస్తుండండంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 49,169 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10 గంటల సమయానికి 383 పాయింట్లు లాభపడింది. ఇక, 14,816 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ ఉదయం 10 గంటల సమయానికి 106 పాయింట్లు లాభపడింది.టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎమ్ అండ్ ఎమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాభాలను అర్జిస్తున్నాయి. టాటా కన్సూమర్ ప్రోడక్ట్స్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఎయిచర్ మోటార్స్ నష్టాలను చవిచూస్తున్నాయి. కరోనా టీకాలపై పేటెంట్ హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలని డబ్ల్యూటీఓలో భారత్ చేసిన ప్రతిపాదనను అమెరికా సమ్మతించడం మదుపర్ల సెంటిమెంటును పెంచింది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి.
లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement