Friday, November 22, 2024

లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు..

దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడర్స్ మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపడం,అంతర్జాతీయ మార్కెట‍్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై చూపడంతో సెన్సెక్స్‌ 130.66 పాయింట్ల స్వల్ప లాభాలతో  52,9067 పాయింట్లతో ట్రేడ్‌ అవుతుండగా  నిఫ్టీ 32.80 పాయింట్ల లాభంతో 15,856 వద్ద ట్రేడింగ్‌ కొనసాగుతుంది. ఇక, ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్, అంబుజా సిమెంట్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఫెడరల్ బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్, ఎస్‌ బ్యాంక్, ఆర్ట్‌సన్ ఇంజనీరింగ్ లాభాల్లో కొనసాగుతున్నాయి.  ఇక ఈవాల తొలిసారి స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన జొమాటో లిమిటెడ్‌ షేర్లు అందరూ ఊహించినట్లుగానే శుభారంభం చేశాయి. షేరు ధర బీఎస్‌ఈలో రూ.115 వద్ద ప్రారంభమైంది. ఐపీఓ ధర రూ.76తో పోలిస్తే 51.32 శాతం ప్రీమియంతో నమోదైంది. అదే సమయంలో ఎన్‌ఎస్‌ఈలో 53 శాతం ప్రీమియంతో రూ.116 వద్ద లిస్టయ్యింది. దీంతో లిస్టింగ్‌ సమయంలో ఈ సంస్థ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.90,219.57 కోట్ల వద్ద నిలిచింది. 

ఇది కూడా చదవండి : నేడే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు.. లింక్ ఇక్కడ..

Advertisement

తాజా వార్తలు

Advertisement