దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఫైనాన్స్ స్టాకుల కొనుగోళ్లకు మదుపుదారులు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 380 పాయింట్లు లాభపడి 51,017కి చేరుకుంది. నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 15,301 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, ఎమ్ అండ్ ఎమ్ తదితర షేర్లు లాభాలను ఆర్జించాయి. పవర్‌గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ నష్టాలను చవి చూశాయి. దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వార్తలు మదుపర్లలో నమ్మకాన్ని పెంచాయి. అలాగే ఐటీ, స్థిరాస్తి రంగాల లాభాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి
Advertisement
తాజా వార్తలు
Advertisement