దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈ రోజు ఆరంభంలో ఫ్లాట్‌గా ప్రారంభమై ఆద్యంతం ఊగిసలాటలో పయనించిన సూచీలు ఇంధన, స్థిరాస్తి, టెలికాం, బ్యాంకింగ్ రంగాల నుంచి మద్దతు లభించడంతో చివర్లో పుంజుకున్నాయి. సెన్సెక్స్ చివరకు 166 పాయింట్ల లాభంతో 52,484 వద్ద.. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 15,722 వద్ద స్థిరపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.77 వద్ద నిలిచింది. రిలయన్స్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ తదితర బ్లూచిప్ కంపెనీల షేర్లు లాభపడటంతో మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 166 పాయింట్లు లాభపడి 52,485కి చేరుకుంది. నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 15,722 వద్ద స్థిరపడింది.
ఇది కూడా చదవండి: టిక్‌టాక్ ప్రియులకు గుడ్ న్యూస్..