దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమైన సూచీలు మద్యాహ్నం తర్వాత ఐటీ, టెక్, టెలికాం, ఆటో, లోహ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడే కనిష్ఠాలకు చేరుకున్నాయి. ఆ తర్వాత బ్యాంకుల నుంచి అండ లభించడంతో చివరకు మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 29 పాయింట్లు (0.05 శాతం) క్షీణించి 58,250.26 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 9 పాయింట్లు (0.05 శాతం) నష్టపోయి 17,353.50 వద్ద ముగిసింది. నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 73.57 వద్ద ఉంది. సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎన్‌టీపీసీ, టైటన్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నేడు రాణిస్తే.. నెస్లే ఇండియా, మారుతీ, టీసీఎస్ ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, రిలయన్స్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో షేర్లు డీలాపడ్డాయి.
ఇది కూడా చదవండి: Big boss5: ప్రియాంక సింగ్ కు మద్దతు ప్రకటించిన నాగబాబు