Tuesday, November 26, 2024

మార్కెట్లు బేజారు..

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయిన మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఈనాటి ట్రేడింగ్ ను లాభాల్లో ప్రారంభించిన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 592 పాయింట్ల మేర నష్టపోయింది. అయితే, చివర్లో హిండాల్కో, వేదాంత, టాటా స్టీల్ వంటి మెటల్ స్టాకులతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో… మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి.దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 28 పాయింట్ల నష్టంతో 54,525కి పడిపోగా… నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 16,282 వద్ద స్థిరపడింది.

ఇది కూడా చదవండి: శాకుంతలం నుంచి అల్లుఅర్హ గ్లింప్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement