Tuesday, November 26, 2024

దలాల్ స్ట్రీట్ జోష్..

దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటిలాగే నేడు కూడా భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ వారంలో ప్రారంభం నుంచి వరుసగా లాభాల బాటలో కొనసాగుతున్నాయి సూచీలు. ఇవాళ కూడా సూచీలు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి లాభాలతోనే ముగిసాయి. సెన్సెక్స్ 54 వేల మార్కు, నిఫ్టీ 16 వేల మార్కు దాటడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలపడి ఉదయం నుంచీ మార్కెట్లలో కొనుగోళ్ల కళ కనపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ షేర్ల పట్ల మదుపుదారులు మొగ్గు చూపారు. దీంతో, చివరికి సెన్సెక్స్ 546.41 పాయింట్ల లాభంతో 54,369.77 వద్ద ముగియగా.. నిఫ్టీ 128.05 పాయింట్ల లాభంతో 16,258.80 వద్ద క్లోజయింది.

ఇక నేటి సెషన్లో హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం&ఎం ఫైనాన్సియల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏక్సిస్ బ్యాంక్, ఎస్కార్ట్స్, గ్రాన్యూల్స్ ఇండియా, డా.రెడ్డి ల్యాబ్స్ తదితర షేర్లు లాభాలను పొందాయి. కాగా, పీఐ ఇండస్ట్రీస్, డాబర్ ఇండియా, ఆర్తి ఇండస్ట్రీస్, ఆల్కెమ్ ల్యాబ్, మైండ్ ట్రీ, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: అయిపాయే: అర్జెంటీనా చేతిలో ఓడిన భార‌త మ‌హిళ‌ల హాకీ జట్టు..

Advertisement

తాజా వార్తలు

Advertisement