దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ చివరివరకు అలాగే ట్రేడ్ అయ్యాయి. దేశీయంగా కోవిడ్ కష్టాలు వెంటాడుతున్నా అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో లాభాల బాట పట్టాయి.మెటల్, ఆటో, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు అండతో మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదులుతుండడం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒకానొక సమయంలో దాదాపు 411 పాయింట్ల వరకు లాభపడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 296 పాయింట్లు లాభపడి 49,502కి చేరుకుంది. నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 14,942 వద్ద స్థిరపడింది.
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement