Saturday, November 23, 2024

లాభాలకు బ్రేక్..భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు… చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ముఖ్యంగా ఫైనాన్స్, మెటల్ సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 340 పాయింట్లు కోల్పోయి 49,161కి పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు పతనమై 14,850కి దిగజారింది.

కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, ఐఓసీ, ఓఎన్‌జీసీ లాభాలను ఆర్జించాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ నష్టాలను చవిచూశాయి. దేశయంగా పెరుగుతున్న లాక్‌డౌన్లు, కోవిడ్ భయాలు, అంతర్జాతీయ మార్కెట్ల వ్యతిరేక పవనాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో రోజులో ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఇక, వరుసగా నాలుగు రోజుల లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement