Thursday, November 21, 2024

లాభాలతో ముగిసిన మార్కెట్లు..

ఆరంభంలో నష్టాలతో ప్రారంభించిన మార్కెట్లు భారీగా కోలుకుని లాభాలతో ముగిసింది. మార్కెట్‌ పతనంతో షార్ట్‌ కవరింగ్‌ వైపు ట్రేడర్లు మొగ్గు చూపారు. దేశంలో కరోనా తీవ్ర రూపం దాలుస్తున్న వేళ స్టాక్‌ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో సూచీలు ఇవాళ సెషన్​ను భారీ నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు కాస్త ఊరటనిచ్చాయి. ఒక దశలో 47,204 వద్ద ఇంట్రా డే కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ మధ్యాహ్నం తర్వాత కోలుకుంది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్‌ 375 పాయింట్లు ఎగిసి 48080 వద్ద , నిఫ్టీ 110 పాయింట్లు ఎగిసి 14406 వద్ద పటిష్టంగా ముగిసాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌ 722 పాయింట్లు పెరిగి ఇంట్రాడే గరిష్ట స్థాయి 31,834.50 వద్ద ముగిసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement