అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్లు కూడా లాభాల బాటలోనే పయనించాయి. నేడు ఆర్థిక సంవత్సరం తొలిరోజు కాగా, భారత స్టాక్ మార్కెట్లు ఉత్సాహభరిత వాతావరణంలో లావాదేవీలు కొనసాగించాయి. సెన్సెక్స్ 520.68 పాయింట్ల లాభంతో 50,029.83 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలో 176.70 పాయింట్ల వృద్ధితో 14,867.40 వద్ద స్థిరపడింది. ఇవాళ్టి ట్రేడింగ్ లో 2,120 షేర్లు ముందంజ వేయగా, 727 షేర్లు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాయి. 143 షేర్లు తటస్థంగా నిలిచాయి. జేఎస్డబ్ల్యూ, హిందాల్కో, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ లాభాలను ఆర్జించగా.. హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టాలను చవిచూశాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement