Saturday, November 16, 2024

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆద్యంతం ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. లాభాలతో ప్రారంభమై కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. చివరికి భారీ నష్టాలతో రోజును ముగించాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి లాభాల్లో కొనసాగిన మార్కెట్లు ట్రేడింగ్ చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 465 పాయింట్లు కోల్పోయి 48,253కి పడిపోయింది. నిఫ్టీ 137 పాయింట్లు పతనమై 14,496కి దిగజారింది. ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, ఎస్బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా లాభాలను ఆర్జించాయి. రిలయన్స్‌, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఇన్ఫోసిస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి. కోవిడ్ భయాలు, మూడో దశ వ్యాక్సినేషన్ విషయంలో గందరగోళం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement