Thursday, November 21, 2024

లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌.. సానుకూలంగా సూచిక‌లు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సోమవారం లాభాల బాటలో పయనించింది. వరుసగా మూడోరోజూ సూచీలు సానుకూలంగా స్పందించాయి. సెన్సెక్స్‌ 465 పాయింట్లు, నిఫ్టీ 17,500 పాయింట్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ మినహా ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలు గడించాయి. ఎస్‌బీఐ షేర్ల విలువ 2 శాతం మేర పతనమైనాయి. కోల్‌ ఇండియా,మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిండాల్కో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, డా.రెడ్డీస్‌ ల్యాబ్స్‌, రిల్‌, ఇండస్‌ బ్యాంక్‌, అపోలో హాస్పిటల్స్‌ షేర్లు లాభాలు ఆర్జింటి పెట్టాయి. సోమవారం మార్కెట్లు ప్రారంభమయినప్పటినుంచి నిఫ్టీ, సెన్సెక్స్‌ లాభాలబాటలో పయనించాయి.

ఒక దశలో సెన్సెక్స్‌ 500 పాయింట్ల వరకు చేరుకుని చివరకు 58,853 పాయింట్ల వద్ద స్థిరపడింది. శుక్రవారం ఫలితాలతో పోలిస్తే 465 పాయింట్ల (0.8 శాతం) మేర లాభపడింది. మరోవైపు నిఫ్టీ 128 (0.73 శాతం) పాయింట్లు లాభపడి 17,525 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీపీసీఎల్‌, ఎస్‌బీఐ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, బ్రిటానియా, అదానీ పోర్ట్స్‌, హీరో మోటార్‌ కార్పోరేషన్‌ 1 శాతం చొప్పున నష్టపోయాయి. ఇక బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు రెండూ 0.3 శాతం మేర లాభాలు గడించాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.4 శాతం మేర, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 0.02 శాతం మేర నష్టపోగా మిగతా సంస్థల షేర్లనీ లాభాలు గడించాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement