Friday, November 22, 2024

Stock Market – నేడూ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్ ….

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం మరోసారి రికార్డ్‌లు సొంతం చేసుకుంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ముగింపు వరకు అదే ఒరవడిని కొనసాగించింది. ఇక నిఫ్టీ, సెన్సెక్స్ ఊహించని రీతిలో పుంజుకున్నాయి. మొదటి సారి సెన్సెక్స్ 78100 మార్కు దాటగా.. నిఫ్టీ కూడా 23700లకు పైగా మార్కు క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సెన్సెక్స్ 712 పాయింట్లు లాభపడి 78, 053 దగ్గర ముగియగా.. నిఫ్టీ 183 పాయింట్లు లాభపడి 23, 721 దగ్గర ముగిసింది. రెండూ కూడా తాజా అల్‌టైమ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభాల్లో కొనసాగాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.49 దగ్గర ప్రారంభమైంది.

- Advertisement -

సెన్సెక్స్‌ సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌ అండ్‌ టీ, సన్‌ఫార్మా, టాటా మోటార్స్‌, రిలయన్స్‌, మారుతీ షేర్లు లాభాల్లో ఉండగా… ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, నెస్లే ఇండియా, టైటన్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement