ముంబయి – దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు ఓ మోస్తరుగా కదలాడాయి. చివర్లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఐటీ, ప్రైవేట్ బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు కలిసివచ్చాయి. మంగళవారం ముగింపు (75, 838)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభనష్టాలతో దోబూచులాడింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు భారీ నష్టాలను చవిచూసినప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ మాత్రం నిలదొక్కుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలు కావడంతో సెన్సెక్స్ భారీగా లాభపడింది. చివరికి 566 పాయింట్లు లాభపడి 76, 404 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 23, 155 వద్ద రోజును ముగించింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (3.16%), టీసీఎస్ (2.97%), టెక్ మహీంద్రా (2.28%), సన్ ఫార్మా (1.78%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.63%).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-2.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.24%), యాక్సిస్ బ్యాంక్ (-1.02%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.76%), ఎన్టీపీసీ (-0.56%).