Tuesday, November 26, 2024

Stock Market – స్థిరంగా స్టాక్ మార్కెట్… స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన ట్రేడింగ్

స్టాక్ మార్కెట్‌ సూచీలు మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 77,145.46 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను అందుకుంది. నిఫ్టీ సైతం 23,481.05 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను టచ్‌ చేసింది. తర్వాత లాభాల స్వీకరణతో లాభాలు పరిమితమయ్యాయి.

దేశీయ స్టాక్‌మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 23,399 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 204 పాయింట్లు పెరిగి 76,810 వద్ద ముగిసింది.

- Advertisement -


సెన్సెక్స్‌ 30 సూచీలో టైటాన్‌, ఎం అండ్‌ ఎం, ఎల్‌ అండ్‌ టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, విప్రో, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే, ఇన్ఫోసిస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, టాటా ‍స్టీల్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, భారతీఎయిరటెల్‌, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement