Friday, November 22, 2024

Stock Market – ఎగ్జిట్‌ పోల్స్‌ జోష్ – తొలి గంట లోనే 2 వేల పాయింట్లకు పైగా లాభాలతో బుల్ రన్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఏకంగా 2,000 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ మొదలుపెట్టింది.

నిఫ్టీ ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా పుంజుకుంది. ఎన్‌డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు సూచీల్లో జోష్‌ నింపాయి.

- Advertisement -

అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలూ దన్నుగా నిలుస్తున్నాయి. రూపాయి బలపడడం; బ్యాంకింగ్‌, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు రాణించడం కలిసొస్తోంది.

ఉదయం సమయంలో సెన్సెక్స్‌ 1,808 పాయింట్ల లాభంతో 75,769 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 613 పాయింట్లు లాభపడి 23,144 దగ్గర కొనసాగుతోంది. అంతకుముందు సెన్సెక్స్‌ 76,738.89 దగ్గర, నిఫ్టీ 23,338.70 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేశాయి.

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌-30 సూచీలో అన్ని షేర్లూ లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement