Saturday, January 25, 2025

Stock Market | రెండు రోజుల లాభాలకు బ్రేక్..

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. కనిష్ట స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించినప్పటికీ… ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద అమ్మకాలకు మొగ్గు చూపడంతో రోజంతా సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరకు అమ్మకాలు కొనసాగడంతో సూచీలు వారంలో నష్టాలతో ముగిశాయి. దీంతో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది.

సెన్సెక్స్ ఉదయం 76,455.35 పాయింట్ల వద్ద(76,520.38)స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. ఆ తరువాత లాభనష్టాల మధ్య కదలాడింది. ఇంట్రాడేలో 76,091.75 – 76,985.95 పాయింట్ల మధ్య చలించిన సూచీ,చివరికి 329.92 పాయింట్ల నష్టంతో 76,190.46 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 113.15 పాయింట్ల నష్టంతో 23,092.20 పాయింట్ల వద్ద ముగిసింది.డాలరుతో రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడి 86.22 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. హిందుస్థాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 78.60 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 2780.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement