Friday, November 22, 2024

నాలుగో రోజూ న‌ష్టాలే…

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనా చివ‌ర‌కు నష్టాల్లోతో ట్రేడింగ్ ముగిసింది.. మధ్యాహ్నం త‌ర్వాత‌ ఐటీ, స్టీల్, బ్యాంకింగ్‌ షేర్లలో వచ్చిన అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి. మరోవైపు సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతన ప్రభావం కొనసాగింది ఉదయం సెన్సెక్స్ 58,168.75 దగ్గర లాభాలతో ప్రారంభమై చివరకు 337.66 పాయింట్ల నష్టంతో 57,900.19 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17,160.55 దగ్గర ప్రారంభమై చివరకు 111 పాయింట్లు నష్టపోయి 17,043.30 దగ్గర ముగిసింది.
సెన్సెక్స్ సూచీలో టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టపోయాయి. కాగా,నేడు అదాని గ్రూప్ సంస్థ‌లు తొమ్మిది శాతం న‌ష్టాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement