దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. రుణాల మారిటోరియంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిన్న మార్కెట్లను లాభాల్లో నడిపించగా…ఇవాళ మాత్రం దానిప్రభావం ఏమి కనిపించడం లేదు. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు సైతం ఒడుదొడుకుల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 49,786, వద్ద, నిఫ్టీ 14,712 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టాయి. ప్రారంభమయిన కాసేపటికే సెన్సెక్స్ 246 పాయింట్లు నష్టపోయి 49,805 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 86 పాయింట్లు దిగజారి 14,728 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.54 వద్ద కొనసాగుతోంది. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఫ్యూచర్ దాదాపు 40 పాయింట్ల దిగువన ట్రేడయ్యింది. వీటితో పాటు దేశీయంగా కీలక కంపెనీల షేర్లు ఒత్తిడి ఎదుర్కొంటుండడం సూచీలను కలవరపెడుతోంది. దాదాపు అన్ని ప్రఅమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు సైతం ఒడుదొడుకుల్లో కదలాడుతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన కంపెనీల షేర్లు రెడ్ లో ట్రేడ్ అవుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement