Saturday, November 23, 2024

భారీ లాభాలను ఆర్జించిన SBI..

స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా తొలి త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది. తొలి త్రైమాసికంలో లాభం 55 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ. 6,504 కోట్లకు చేరుకున్నది. అలాగే, వడ్డీ ఆదాయాలు కూడా 4 శాంత పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభాలు రూ.4,189.34 కోట్లు. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, బ్యాంక్ నిర్వహణ లాభం కూడా 5 శాతం పెరిగి రూ.18,975 కోట్లకు చేరింది. బ్యాంక్ వడ్డీ ఆదాయాలు 3.74 శాతం పెరిగాయి. మొదటి త్రైమాసికంలో భారీగా లాభాలు రావడంతో ఎస్‌బీఐ బ్యాంక్ షేర్లలో రికార్డు పెరుగుదల కనిపించింది. ఎస్‌బీఐ స్టాక్ బీఎస్‌ఈలో 3.57 శాతం పెరిగి రూ.462.40 వద్ద ట్రేడవుతున్నది. ట్రేడింగ్ సమయంలో ఈ స్టాక్ రూ.463.55 కు చేరుకున్నది. రికార్డు ర్యాలీతో బ్యాంక్ మార్కెట్ క్యాప్ కూడా మొదటిసారిగా రూ.4 లక్షల కోట్లు దాటింది. గతంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్ల స్థాయిని దాటింది.

ఇది కూడా చదవండి: సోనూసూద్ సాంగ్ వచ్చేస్తుంది..రెడీనా

Advertisement

తాజా వార్తలు

Advertisement