Sunday, November 24, 2024

ఈకిన్‌కేర్‌తో స్టాన్‌ప్లస్‌ భాగస్వామ్యం

హెల్త్‌కేర్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఉన్న ఈకిన్‌కేర్‌, మెడికల్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సంస్థగా ఉన్న స్టాన్‌ప్లస్‌ ఒప్పందం చేసుకున్నాయి. కార్పోరేట్‌ ఉద్యోగులకు అత్యాధునిక, అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ రెండు సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలపాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఒప్పందంతో ఈకిన్‌కేర్‌కు ఉన్న 5 వేలకు పైగా కార్పొరేట్‌ కస్టమర్లకు స్టాన్‌ప్లస్‌కు 550కిపైగా పట్టణాల్లో ఉన్న 6 వేలకు పైగా అంబులెన్స్‌ సర్వీసెస్‌లు అందుబాటులోకి వస్తాయి. మూడు వందలకుపైగా ఆసుప్రతుల్లో వౖౖె ద్య సేవల సపోర్టును ఈ సంస్థ అందిస్తోంది.

ఈకిన్‌కేర్‌ క్లైయింట్స్‌కు స్టాన్‌ప్లేస్‌ అంబులెన్స్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. మెడికల్‌ ఎమర్జెన్సీలో కేవలం 15 నిముషాల్లోనే ఇంటి వద్దకు అంబులెన్స్‌ సేవలు అందించనుంది. ఈ ఒప్పందంతో తమ కార్పోరేట్‌ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుకలుగుతుందని ఈకిన్‌కేర్‌ సీఈఓ, కో-ఫౌండర్‌ కిరణ్‌ కలకుంట్ల చెప్పారు. 15 నిముషాలలోపుగానే మెడికల్‌ రెస్పాన్స్‌ టీమ్‌ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని స్టాన్‌ప్లస్‌ సీఈఓ ప్రభుదీప్‌ సింగ్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement