Sunday, November 24, 2024

HYD: గ్రేసియాతో శుద్ధి చేసిన మొలకలు ఆరోగ్యంగా ఉంటాయి… గోద్రెజ్ ఆగ్రోవెట్

హైద‌రాబాద్: గ్రేసియాతో శుద్ధి చేసిన మొలకలు ఆరోగ్యంగా ఉంటాయి, నర్సరీ యజమానులకు ప్రయోజనం చేకూరుస్తాయని గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ తెలిపింది. గోద్రెజ్ ఆగ్రోవెట్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ సీఈఓ రాజవేలు ఎన్‌కె మాట్లాడుతూ… మిరప పరిశ్రమలో, విజయం అనేది నారు నాణ్యతతో ప్రారంభమవుతుందన్నారు. గ్రేషియాతో శుద్ధి చేసిన మొలకలు ఆరోగ్యంగా ఉంటాయని, నర్సరీ యజమానులకు మరింత వ్యాపారం జరిగేందుకు ఇది తోడ్పడుతుందన్నారు.

ఎందుకంటే రైతులు వారి నుండి కొనుగోలు చేస్తారన్నారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ గ్రేసియా ఆరోగ్యకరమైన నారు పెంపకంలో చురుకైన విధానాన్ని అందిస్తుందన్నారు. సరైన సమయంలో, సరైన పరిమాణంలో గ్రేసియాను వినియోగించటం ద్వారా నర్సరీ యజమానులు ప్రధాన పొలాల్లో మెరుగైన నాట్ల కోసం ఆరోగ్యకరమైన, తెగులు లేని నారును నిర్ధారించవచ్చన్నారు. అందువల్ల నర్సరీ యజమానుల సంపద కోసం, ఆరోగ్యంగా ప్రారంభించండి, స్మార్ట్‌గా ప్రారంభించండి, గ్రేసియాతో ప్రారంభించమని తాము సలహా ఇస్తున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement