హైదరాబాద్ : డిజిటల్ ఒరవడి బ్యాంకింగ్, లావాదేవీలు, పెట్టు-బడుల కార్యకలాపాలను కాలంతో పాటు- సులభతరం చేస్తోంది. కానీ మోసగాళ్లు ఆన్లైన్ లావాదేవీల్లో అవకాశాన్ని కనుగొంటూ అమాయకులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. ఫోన్ పే నుండి తాము ప్రజలు ఇలాంటి మోసాల ద్వారా దోపిడీకి గురి కాకుండా ఉండేందుకు, మోసాలకు సంబంధించిన అనేక ఉదంతాల గురించిన సమాచారాన్ని పంచుకునేలా ఎప్పటికప్పుడు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ క్రమంలోనే ఈ కథనం ద్వారా తాము ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్ గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాము.
ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్ అంటే ఏమిటి ?
తప్పుడు సమాచారం ఆధారంగా మదుపుదారులు పెట్టు-బడి పెట్టాలనుకున్నప్పుడు బ్రోకర్ వేషంతో ఒక మోసగాడు వ్యవహరించినప్పుడు లేదా ఒక నకిలీ వెబ్ సట్లో ట్రేడింగ్ చేసేలా ప్రజలను మోసగించాలనుకున్నప్పుడు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్ చోటు- చేసుకుంటు-ంది. ఈ పెట్టు-బడి స్టాక్‌లు, బాండ్లు, అసెట్లు- తదితరాల రూపంలో ఉండవచ్చు.
మోసగాళ్లు ఎలా వ్యవహరిస్తారు?
మోసగాళ్లు తరచుగా పెట్టు-బడిదారులకు ఎలాంటి రిస్క్ లేకుండా నమ్మశక్యం కానంత లాభాలను ఇవ్వజూపుతారు. ఇతరులు పొందుతున్న ప్రయోజనాన్ని మీరు కోల్పోతున్నారనే ఆందోళనను మీలో కలిగించాలనేదే దీనివెనుక వారి ఉద్దేశ్యంగా ఉంటు-ంది. ఈ తరహా మోసగాళ్లు విశ్వసనీయమైన, అధికారికమైన ట్రేడింగ్ ప్లాట్‌ఫారంలు లేదా పెట్టుబడి వ్యాపారాలుగా అనుకరించే సోషల్ మీడియా, వెబ్సైట్ల మార్గంలో తమంతతాముగా ఆన్లైన్ ప్రచారం చేసుకుంటారు. ఈ రకాల మోసాల కుట్రదారులు తరచుగా తమకు స్థానిక లేదా జాతీయ ఆర్థిక చట్టాల నుండి మినహాయింపు ఉందని చెప్పుకుంటారు. వారు నిధులను తమ ఆధీనంలో ఉంచుకుని, నకిలీ పన్నులు, ఫీజులు లేదా ఇతర ఛార్జీలను డిమాండ్ చేయడం ద్వారా మిమ్మల్ని మోసగించే ప్రయత్నం చేయవచ్చు. చాలావరకు ట్రేడింగ్ స్కామ్‌లు సోషల్ మీడియాలో లేదా మెసేజింగ్ అప్లికేషన్ల ద్వారా ప్రారంభమవుతాయి. మీకు ఊహించని రీతిలో ఎవరైనా వ్యక్తి నుండి కాల్ వస్తే లేదా మీరు ఎన్నడూ వినని ఒక ట్రెండింగ్ వెబ్‌సైట్‌కు మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తిని ఆన్లైన్లో కలిసినా, అది ఒక స్కామ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎంత డబ్బు మీరు సంపాదించవచ్చు, ఎంత సులభంగా, రిస్క్ లేకుండా ఉంటు-ందని వారి ఇచ్చే హామీలతో సంబంధం లేకుండా మీరు ఇలాంటి స్కామ్ ట్రేడింగ్ వెబ్‌సైట్‌కు పంపే ఎంత డబ్బునైనా మీరు కోల్పోతారు.
సోషల్ మీడియాలో వెతకడం, బాధితులు కాగల వారికోసం సోషల్ మీడియా, మెసేజింగ్ అప్లికేషన్లను వెతకడంతో పాటు- కింది సంకేతాలు కూడా ట్రేడింగ్ స్కామ్ జరిగే అవకాశాలను సూచిస్తాయి.:
1.అవాస్తవిక లాభాలు: చిన్న పెట్టు-బడులతో నమ్మశక్యం కానంత లాభాలను అందుకోవచ్చనే ఆలోచనను మోసపూరిత బ్రోకర్లు విస్తృతంగా ప్రచారం చేస్తారు.
2.పెట్టుబడిని ఉపసంహరించుకోవడం సాధ్యం కాదు: లాభాలు పెరిగిన తరుణంలో, నగదును ఉపసంహరించుకోవాలని పెట్టు-బడిదారు కోరుకున్నప్పుడు ఉద్దేశించిన ఆదాయాలను యాక్సెస్ చేసుకోలేకపోతున్నట్టు- కనిపిస్తుంది. దీనికి సమాధానాలు కోరినప్పుడు, ట్యాక్సులు, కమిషన్ల పేరుతో అర్థం, పర్థం లేని సాకులు చెబుతారు. నిధుల ఉపసంహరణకు ట్యాక్సులు, కమిషన్ల పేరుతో యాక్సెస్ ఇవ్వకపోవడమనేది ఉత్తుత్తిదేనని బాధితుడు తెలుసుకుంటారు. కానీ అప్పటికే డబ్బును తిరిగి ఇచ్చే ఉద్దేశ్యం మోసగాడికి లేదనే విషయం నిరూపితమవుతుంది.
3.మెరుగైన లాభాలకోసం ఎక్కువగా పెట్టుబడి: తెలివైన మోసగాళ్లు తమ వైఖరిని సమర్థించుకునేలా కొత్త, కొత్త కథలు అల్లుతూ, త్వరలోనే ఉపసంహరించుకోవచ్చనే హామీతో మరింత డబ్బును అడుగుతూనే ఉంటారు. 4.స్పందన లేకపోవడం: మోసగాళ్లు మనం కాల్ చేసినప్పుడు స్పందించరు. మన వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బును పిండుకున్న తర్వాత మనకు ఎప్పుడూ అందుబాటు-లో ఉండరు. అసలు సమాధానమే ఉండదు. మోసాలకు సంబంధించిన కొన్ని సంకేతాలపై కన్నేసి ఉంచడం ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్ ను గుర్తించడం వీలవుతుంది. ఒక ట్రేడింగ్ స్కామ్‌కు బలవుతున్నట్టు- మీకు అనుమానం ఏర్పడితే, నష్టాన్ని వీలైనంత మేర తగ్గించుకునేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టి, మరింత నష్టాలు జరగకుండా చూడడం చాలా ముఖ్యం. ఈ రకమైన ఆన్లైన్ స్కామ్‌లను గుర్తించడం సాధ్యమవుతుంది. మీరు ట్రేడింగ్ స్కామ్‌కు గురైనట్లు- మీరు అనుమానించినట్లయితే, దానివల్ల జరిగే నష్టాలను తగ్గించడానికి, తదుపరి నష్టాలను నివారించడానికి తక్షణ చర్య తీసుకోవడం చాలా ముఖ్యం. ఫోన్ పే యాప్‌లో లేదా కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా ఫోన్ పే సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మీరు అలాంటి స్కామ్‌లను నివేదించవచ్చు.