హైదరాబాద్ : ముంబయిలోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థల్లో ఒకటైన సర్దార్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్పీఐటీ) తన వార్షిక పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని డిసెంబర్ 21, 2024న అంధేరీ వెస్ట్‌లోని భవన్ క్యాంపస్‌లో ఎస్పీ జైన్ ఆడిటోరియంలో నిర్వహించింది. ఈ ప్రత్యేక కార్యక్రమం 1999 గ్రాడ్యుయేటింగ్ బృందం 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.
1999 బ్యాచ్ పూర్వ విద్యార్థులు, ఫోన్‌పే సీఈఓ అండ్ వ్యవస్థాపకులు సమీర్ నిగమ్ అండ్ ఫోన్‌పే సీటీఓ అండ్ వ్యవస్థాపకులు రాహుల్ చారి ఈ కార్యక్రమంలో 1 మిలియన్ గ్రాంట్ ప్రకటించారు. ఈసందర్భంగా రీయూనియన్‌లో ఫోన్‌పే సహ వ్యవస్థాపకులు అండ్ సీటీఓ రాహుల్ చారి మాట్లాడుతూ… తాను ఎస్పీఐటీలో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకున్నప్పుడు, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మొదటి గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌లో భాగం అయిన జ్ఞాపకాలు తన మనసులో ప్రత్యేక స్థానంగా నిలుస్తాయన్నారు. ఇక్కడే తన సహ వ్యవస్థాపకుడు సమీర్, తాను ఇన్‌స్టిట్యూట్‌లోనే తమ మొదటి వెంచర్ కార్యాలయంతో తమ వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించామన్నారు.
తరువాత తరం ఆవిష్కర్తలు, నాయకులకు స్ఫూర్తిని, సాధికారతను కొనసాగించే గొప్ప సంస్థగా ఎస్పీఐటీని నిర్మించడంలో సహాయపడటానికి ఇతర పూర్వ విద్యార్థులు కూడా తమ వంతు సహకారం అందిస్తారని తాను ఆశిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమం ఎస్పీ-ఛేంజ్‌మేకర్స్ అవార్డులతో అత్యుత్తమ విజయాలు సాధించిన పూర్వ విద్యార్థులను సత్కరించింది. వీటిలో అత్యుత్తమ పూర్వ విద్యార్ధి – సౌరభ్ నేత్రవాల్కర్, ఆవిష్కరణ అండ్ వ్యవస్థాపకత – విక్రాంత్ పోట్నిస్, నాయకత్వం అండ్ ప్రభావం – స్వాగత్ భండారి ఉన్నారు. ఈ అద్భుతమైన రీయూనియన్ ఎస్పీఐటీ శక్తివంతమైన పూర్వ విద్యార్థుల సంఘం సాధించిన విజయాలను జరుపుకుంది. సర్దార్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్. బి.ఎన్ చౌదరి ఈ మాటలతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. రాహుల్ చారి, సమీర్ నిగమ్ అందించిన 1మిలియన్ గ్రాంట్‌కి తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఇది తమ కళాశాల, విద్యార్థుల అభివృద్ధిని మెరుగు పరిచే పరివర్తనాత్మక దశ అన్నారు.