ఈ ఆర్థిక సంవ త్సరం మొదటి విడత సార్వభౌ మ పసిడి బాండ్లను ఈ నెల 20 నుంచి 24 వరకు జారీ చేయను న్నారు. బాండ్ల ఇష్యూ ధర గ్రాముకు 5,091 రూపా యిలుగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి వారికి 50 రూపాయిలు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. రెండో విడత పసిడి బాండ్లను 2022 ఆగస్టు 22 నుంచి జారీ చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. బంగారంపై పెట్టుబడి పెట్టే వారికి ఇది మంచి అవకాశమని మార్కెట్ నిపుణులు అభిప్రా యపడ్డారు. పెట్టుబడిపై సంవత్సరానికి 2.50 శాతం వడ్డీ పొందడంలో పాటు, బంగారం ధర పెరిగితే ఆ లాభాలు కూడా పొందవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టేవారికి పన్ను మిన్హయింపు లభిస్తుంది. ఒక్కో బాండ్ ను ఒక గ్రాముగా లెక్కిస్తారు.
999 స్వచ్ఛత కలిగిన బంగారం ధరను లెక్కించి బాండు విలువగా నిర్ణయించారు. ఇష్యూ తేదికి ముందు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయిన ధర సరాసరిని తీసుకుని బాండ్ విలువగా నిర్ణయించారు. బంగారం బాండ్లలో పెట్టుబడి పెట్టే వారికి 2.50 శాతం వార్షిక వడ్డీని ఇస్తారు. పెట్టుబడి పెట్టిన నాటి నుంచి 8 సంవత్సరాల ఇవి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. కాలపరిమితి కంటే ముందే తీసుకోవాలనుకునే వారు ఐదు సంవత్సారల తరువాత పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఇలాంటి వారికి పన్ను మిన్హంపులు లభించవు. పూర్తికాలం ఉన్న ఇన్వెస్టర్లు పన్ను లాభాలు పొందవచ్చు. పసిడి బాండ్లను కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్బీఐ జారీ చేస్తుంది. వీటిని కొనుగోలు చేసే వారు పాన్ కార్డు తప్పనిసరిగా అప్లికేషన్‌తో జత చేయాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.