భారత మార్కెట్లో సరికొత్త ఇన్‌జోన్ బడ్స్ ట్రూలీ వైర్లెస్ స్టీరియో ఇయర్ ఫోన్స్ ని లాంచ్ చేసింది సోనీ. ఇవి ఇన్ ఇయర్ డిజైన్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్సీ) ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 8.4 ఎంఎం డ్రైవర్లను అందించారు. యూఎస్బీ టైప్-సీ డాంగిల్ కనెక్షన్ ఫీచర్ కూడా ఉంది. ఎల్1 చిప్‌తో.. బ్లూటూత్ ఎల్ఈ ఆడియోను అందించనుంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నాయి. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న ఈ ఈ ఇయర్‌బడ్స్ రూ.17,990గా నిర్ణయించారు. జనవరి 22వ తేదీ నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు.
సోనీ ఇన్‌జోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
సోనీ ఇన్‌జోన్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉండనుంది. యాంబియంట్ సౌండ్ మోడ్‌తో ఈ ఇయర్ ఫోన్స్ మార్కెట్లోకి రానున్నాయి. వీటిలో 8.4 ఎంఎం డ్రైవర్స్ అందించనున్నారు. దీంతో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మెరుగవుతుంది. ఏఐ ఆధారిత నాయిస్ రిడక్షన్ ఫీచర్ కూడా సోనీ ఇందులో అందిస్తుంది.
ఇవి సోనీ 360 స్పేషియల్ సౌండ్ ఫార్మాట్‌ను సపోర్ట్ చేయనున్నాయి. వర్చువలైజ్డ్ సరౌండ్ సౌండ్‌ను ఈ ఫార్మాట్ ద్వారా అందించనున్నారు. పెయిరింగ్ కోసం బ్లూటూత్ వీ5.3 ఫీచర్ కూడా అందించారు. ఇది 10 మీటర్ల రేంజ్లో ఉన్న డివైసెస్‌ను కూడా డిటెక్ట్ చేయగలదు. స్వెట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్4 రేటింగ్ కూడా ఉంది.
ఇక కాల్స్‌ను ఆన్సర్ చేయడానికి, రిజెక్ట్ చేయడానికి ఇందులో టచ్ ఎనేబుల్డ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైసెస్తో దీన్ని పెయిర్ చేయవచ్చు. సోనీ హెడ్‌ఫోన్స్ కనెక్ట్ యాప్ ద్వారా పెయిరింగ్ ఆన్ కానుంది. వీటిని పూర్తిగా ఛార్జింగ్ పెట్టడానికి రెండు గంటల సమయం పట్టనుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే 12 గంటల వరకు వీటిని ఉపయోగించవచ్చు. ఐదు నిమిషాల పాటు ఛార్జింగ్ పెడితే ఒక గంట ప్లేబ్యాక్ టైమ్ లభించనుంది. వీటి బరువు దాదాపు 13 గ్రాములుగా ఉండనుంది.