Friday, November 22, 2024

సాల్వ్‌ ఫర్‌ టుమారో.. కాంపిటీషన్‌తో ముందుకొచ్చిన శాంసంగ్​

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : శాంసంగ్‌ ఇండియా భారతదేశపు ఉ్వజ్జలమైన యువ మేధస్సు కోసం సాల్వ్‌ ఫర్‌ టుమారోగా నవీన సవాలుతో ముందుకొచ్చింది. శాంసంగ్‌ వారి ఫ్లాగ్‌ షిప్‌ సీఎస్‌ఆర్‌ ప్రోగ్రాం, సాల్వ్‌ ఫర్‌ టుమారో వ్యవస్థలో 16-22 సంవత్సరాల యువత భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా పాల్గొనవచ్చని తెలిపింది. సమాజాన్ని మార్చడానికి వాస్తవిక ప్రపంచం సమస్యల్ని పరిష్కరించడానికి ఇది ఒక అవకాశం. వివిధ శిక్షణా మాడ్యూల్స్‌, బూట్‌ క్యాంప్స్‌ అండ్‌ వర్క్‌ షాప్స్‌ ద్వారా ఎఫ్‌ఐటీటీ అండ్‌ శాంసంగ్‌ నాయకుల సలహా క్రింద తమ ఆలోచనతో పని చేయడానికి ఇది ఒక అవకాశం ఇస్తుంది.

ప్రముఖ ముగ్గురు జాతీయ విజేతలకు తమ వినూత్నమైన ఆలోచనలకు గాను ఐఎన్‌ఆర్‌ 1 కోటి మెగా సహాయం, ఐఐటీ ఢిల్లీ నిపుణులు నుండి మార్గదర్శకుల సహాయం పొందుతారు. ఎంపిక చేయబడిన పార్టిసిపెంట్స్‌ ఐఎన్‌ఆర్‌ 100,000 విలువ గల ఆన్‌ లైన్‌ కోర్స్‌ వోచర్స్‌ వంటి ఇతర ప్రయోజనాలు, శాంసంగ్‌ ఇండియా కార్యాలయాలు, దాని ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలు, బెంగళూరులో శాంసంగ్‌ ఓపెరా హౌస్‌ ను సందర్శించే అవకాశం లభిస్తుందని ఆ సంస్థ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement