హైదరాబాద్ : సుప్రసిద్ధ ట్రాక్టర్ బ్రాండ్స్‌లో ఒకటైన సోలిస్ యాన్మార్ కీలక మైలురాయిని చేరుకుంది. 13,000వ ట్రాక్టర్ విక్రయం ద్వారా ఈ ఘనత సాధించింది. రెండేళ్ల క్రితం భారత్‌లో సోలిస్ యాన్మార్ ట్రాక్టర్ విడుదల చేశారు. ప్రారంభం నుంచి ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్‌కు ప్రతిష్టాత్మక బ్రాండ్‌గా 100 ఏళ్ల జపనీస్ సాంకేతికతను మరో 100 ఏళ్లు ముందు ఉండేలా తీర్చిదిద్దారు. అత్యాధునిక వ్యవసాయ మార్కెట్‌లలో సైతం తన ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. ఏడు యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే సోలిస్ యాన్మార్ ట్రాక్టర్లు నెంబర్ వన్ బ్రాండ్‌గా ఉన్నాయి.
అంతర్జాతీయంగా పేరు సంపాధించిన వైఎం 3 ట్రాక్టర్ శ్రేణిని భారత్‌కు పరిచయం చేసింది. సోలిస్ హైబ్రిడ్ ట్రాక్టర్‌లో అత్యాధునిక సాంకేతికతలు ఉన్నాయి. 13వేలకు పైగా ట్రాక్టర్లు విక్రయించింది. దేశ వ్యాప్తంగా 250 డీలర్‌షిప్స్ కలిగి ఉంది. సోలిస్ యాన్మార్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రమణ్ మిట్టల్ మాట్లాడుతూ.. సంవత్సరాల తరబడిన శ్రమకు ఫలితంగా దక్కిందన్నారు. 13వేల ట్రాక్టర్ విక్రయాల మైలురాయిని 2 ఏళ్లలో పూర్తి చేశామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..