Saturday, November 23, 2024

Wayanad | సీఎం రిలీఫ్ ఫండ్‌కు స్నేహ గ్రూప్ రూ.25 లక్షల విరాళం

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వయనాడ్ జిల్లాలో ఘోరమైన నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విపత్తు కారణంగా 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఆచూకీ తెలియని శవాలు ఎన్నో ఉన్నాయి.

కాగా, వాయనాడ్ బాధితుల కోసం స్నేహా గ్రూప్ తన సామాజిక బాధ్యతలో భాగంగా ఆర్థికంగా సహకరించింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు స్నేహ గ్రూప్ రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చింది. కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి రామ్ రెడ్డి తన స్నేహ ఫౌండేషన్ ద్వారా కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఈ విరాళాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement